తిరుపతి
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీ సోమస్కంధమూర్తి గజ వాహనంపై అనుగ్రహించారు.
భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
ఆద్యంత రహితుడైన శివదేవుడు, ఐశ్వర్యసూచికమైన గజవాహనాన్ని అధిష్టించినపుడు దర్శనం చేసుకోవడం భక్తుల పుణ్యం.
ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ మురళికృష్ణ, ఆలయ ప్రత్యేకాధికారి శ్రీ ఫణికుమార్ నాయుడు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments