14.2.26

హనుమంత వాహనంపై కోదండ రాముడు hanumath vahanam






శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్ర‌వారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.


ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారువాహనసేవ ముందు గజరాజులు డుస్తుండగాభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి


బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు కోదండ వేంకటరాముడై నుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారుశ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు ఉత్సవంలో వాహనంగా హనుమంతుడినివాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలుజ్ఞానవిజ్ఞానాలుఅభయారోగ్యాలు కలుగుతాయి.


కాగా మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారుఅనంత‌రం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ రథోత్స‌వ‌ము వైభ‌వంగా జ‌రుగ‌నుందిరాత్రి 8 నుండి 9 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌సూపరింటెండెంట్ శ్రీ ర‌మేష్‌కంకణభట్టర్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఇతర అధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments