21.2.26

కల్పవృక్ష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం kalpa vruksha





హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో  భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.


వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి :


క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయివాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుందిఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయిఅలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుందిఅటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.


కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల రకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుందిరాత్రి 7 గంటల నుండి 8 గంటల రకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


వాహ‌న‌సేవ‌లో ఎల్ ఏసీ ప్రెసిడెంట్ శ్రీ  వి రెడ్డిఅర్చకులు, ఏఈవో శ్రీ రమేష్టెంపుల్ ఇన్పెక్టర్స్ శ్రీ నిరంజన్శ్రీ రికృష్ణపలువురు అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments