16.2.26

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకంkshetrapalakudu







తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఆదివారం వేడుకగా అభిషేకం జరిగిందితిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


 సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులుఅర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారుపాలుపెరుగుచందనంపన్నీరుకొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు తర్వాత నైవేద్యం సమర్పించారుభక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.


 కార్యక్రమంలో టీటీడీ అధికారులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments