1.2.26

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి దర్శనం lord govindaraja







తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా 6 రోజు శనివారం సాయంత్రం శ్రీదేవిభూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.  


ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామిఅమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారుఇందులో పాలుపెరుగు, తేనెపసుపుచందనంలతో అభిషేకం చేశారుఅనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవిభూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారునంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.


తెప్పలను అధిరోహించిన స్వామిమ్మ‌వార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు


 కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామిశ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ఎఫ్  అండ్ సీఏవో శ్రీ  బాలాజీఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లుశ్రీ నరసింహ మూర్తిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతివీజీవో శ్రీ సురేంద్రఏఈవో శ్రీ నారాయణ చౌదరిడీఈ శ్రీ విశంకర్ రెడ్డిఅర్చకులు , సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments