21.2.26

మంగళంపేట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ maha samprokshana





చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళం పేటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు  నెల 17 నుండి నుండి ప్రారంభమైన మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగిసాయి సందర్భంగా పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.


శుక్రవారం ఉదయం తీర్థగోష్టిగోపుర బలిపీఠ ప్రతిజ్ఞవిగ్రహ ప్రతిష్టప్రాణాదిదశ హోమములుమహాపూర్ణాహుతికుంభోద్వావాసనమండపోదవాసనమదలోద్వాసన మొదలైన కార్యక్రమాల అనంతరం మహాకుంభ సంప్రోక్షణవిద్వాత్సంభవనతీర్థప్రసాద గోష్టి తదితర  కార్యక్రమాలను చేపట్టారు.


 కార్యక్రమంలో  ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసచార్యులుడిప్యూటీ ఈవో శ్రీమతి విఆర్.శాంతిఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరిఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్సూపరింటెండెంట్  శ్రీ నాగేంద్ర ప్రసాద్ఆలయ ఇస్పెక్టర్ శ్రీ పిరాహుల్,  ఆలయ అర్చకులుసిబ్బందివిరివిగా భక్తులు పాల్గొన్నారు.


ఫిబ్రవరి 20 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు


పులిచర్ల మండలం మంగళం పేటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి మార్చి 02 వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృ ఏర్పాట్లు చేపట్టిందిబ్రహ్మోత్సవాలలో భాగంగా 20 తేదీ శుక్రవారం సాయంత్రం 06.00 గం.లకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.


బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 08.00 గం. నుండి 09.00 గం.లకుసాయంత్రం 06.00 గం. నుండి 08.00 గం. వరకు వాహన సేవలు జరుగనున్నాయి.


21 తేదీ శనివారం ఉదయం 08.00 గం.లకు ధ్వజారోహణం చేపడుతారుఅదేరోజు సాయంత్రం 06.00 గం.లకు స్వామి వారు పెద్ద శేష వాహనంపై విహరించనున్నారు.


వాహన సేవల వివరాలు 


ఫిబ్రవరి 22 తేదీ ఉదయం చిన్న శే వాహనంసాయంత్రం హంస వాహనం, 23 తేదీ ఉదయం ముత్యపు పందిరి వాహనంసాయంత్రం సింహ వాహనం, 24 తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం హనుమంత వాహనం, 25 తేదీ ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం 06.00 గం.లకు కల్యాణోత్సవంరాత్రి 08.00 గం.లకు గరు సేవ, 26 తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్ర ప్రభ వాహనం, 27 తేదీ ఉదయం మోహినీ ఉత్సవంసాయంత్రం గజ వాహనం, 28 తేదీ ఉదయం 08.00 గం.లకు రథోత్సవంసాయంత్రం అశ్వవాహనంమార్చి 01 తేదీన ఉదయం 11.00 గం.కు చక్ర స్నానంరాత్రి 07.00 గం.లకు ధ్వజావరోహణంమార్చి 02 తేదీ ఉదయం 09.00 గం.లకు పుష్పయాగ మహోత్సవం చేపడుతారు.


బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగాతాగునీరుఅన్నప్రసాదాలుచలువ పందిళ్లువిద్యుత్పుష్ప అలంకరణలుఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు  చేపట్టారు.

No comments :
Write comments