10.2.26

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం metlotsavam







టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగిందిదాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.


 సంద‌ర్భంగా శ్రీ పి.ఆర్‌.ఆనంద‌తీర్థాచార్యులు మాట్లాడుతూబ్ర‌హ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారుపూర్వం శ్రీ పురందరదాసులుశ్రీ వ్యాసరాజయతీశ్వరులుశ్రీమాన్‌ అన్నమాచార్యులుశ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను ధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని చెప్పారుఅలాంటివారి అడుగుజాడలలో డిచి  దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని వివరించారు.


వివిధ  ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు


అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారుఆంధ్రప్రదేశ్‌తెలంగాణ‌కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 3 వేల‌ మందికిపైగా భ‌జ‌న మండ‌ళ్ళ స‌భ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.


No comments :
Write comments