26.2.26

మార్చి నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు padmavati ammavari temple




•  మార్చి 3న‌ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంట‌ల నుండి రాత్రి 7.30 గంట‌ల వరకు ఆలయం మూత.


•  మార్చి 14 ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.


•  మార్చి 6, 13, 20, 27 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.


-   మార్చి 19 ఉగాది సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు పుష్ప పల్లకీపై ఆలయ మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.  అనంత‌రం రాత్రి 8 గంట‌ల‌కు పంచాంగ శ్ర‌వ‌ణంఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.  


శ్రీ బలరామ‌కృష్ణ స్వామి ఆలయంలో..


-   మార్చి 24 రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీ కృష్ణ స్వామివారికి రాత్రి 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.


శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..


-   మార్చి 6 హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.


శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో..


•  మార్చి 19 సాయంత్రం 05 గంట‌లకు ఉగాది ఆస్థానంపంచాంగ శ్రవణం.


•  మార్చి 7, 14, 21, 28 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు ఉదయం 8 గంట‌లకు అభిషేకం.


అప్పలాయగుంట  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో.....


•  మార్చి 3 చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 నుండి రాత్రి 8 గంట‌ల వరకు ఆలయం మూతఅష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు.


•  మార్చి 19 ఉగాది సందర్భంగా ఉదయం 8 గంట‌లకు తిరువీధి ఉత్సవంఉదయం 9 గంట‌లకు ఉగాది ఆస్థానంఉదయం 10 గంట‌లకు పంచాంగ శ్రవణం.


-  మార్చి 6, 13, 20, 27 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకారణ సేవఅభిషేకం.


-   మార్చి 11 ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.


-   మార్చి 15 శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం.


•  మార్చి 1, 8, 15, 22, 29వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం.

No comments :
Write comments