24.2.26

శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌ pushkarini






తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2 తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్‌రన్‌ నిర్వహించారుటీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి  కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు.


 సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ తెప్పోత్సవాలకు తెప్పలను పూర్తిగా సిద్ధం చేసినట్టు తెలిపారుఇంజినీరింగ్విద్యుత్ఆలయ అధికారులతో కలిసి తెప్ప సామర్థ్యాన్ని పరిశీలించినట్లు చెప్పారు.


తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తిరెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరిస్తారని వివరించారు.


చివరి మూడురోజులు శ్రీదేవిభూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.


మొదటి మూడు రోజులు మూడుసార్లు, 4 రోజు ఐదుసార్లుచివరిరోజు డుసార్లు తెప్పలపై ఉత్సవ మూర్తులు విహరించి భక్తులను అనుగ్రహిస్తారని చెప్పారు.


కాగా తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26,  27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవఫిబ్రవరి 28మార్చి 01, 02 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవంసహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


 తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌లో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంఈఈలు శ్రీ శ్రీనివాసరావుశ్రీ సుధాకర్డిఈ శ్రీ చంద్ర శేఖర్ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments