ఇంటి నుంచి పారిపోయిన బాలుడిని అలిపిరి చెక్‌పాయింట్ వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించి, తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.
తెలంగాణ రాష్ట్రం గట్‌కేసరికి చెందిన లావేటి శ్రీ రఘునందన్, శ్రీమతి మానస దంపతుల కుమారుడు లావేటి సుజిత్ కుమార్ ఫిబ్రవరి 14న ఇంటి నుంచి పారిపోయి తిరుపతికి చేరుకున్నాడు.
అలిపిరి చెక్‌పాయింట్ వద్ద మంగళవారం అనుమానాస్పదంగా ఉన్న బాలుడిని గమనించిన టీటీడీ భద్రతా సిబ్బంది వెంటనే అతని వివరాలను సేకరించి, తల్లిదండ్రులను సంప్రదించి సమాచారం అందించారు.
అనంతరం బుధవారం బాలుడిని వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.
తమ కుమారుడు క్షేమంగా దొరకడంతో కుటుంబ సభ్యులు టీటీడీ అధికారులకు, భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments :
Write comments