12.2.26

సర్వభూపాల వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి sarva bhoopala








శ్రీ‌నివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన బుధ‌వారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీనివాసుడు బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.


రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారువాహనం ముందు వృషభాలుగజరాజులు నడుస్తుండగాభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


సర్వభూపాల వాహ‌నం - య‌శోప్రాప్తి  :


సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థంవీరిలో దిక్పాలకులు కూడా చేరతారుతూర్పుదిక్కుకు ఇంద్రుడుఆగ్నేయానికి అగ్నిదక్షిణానికి యముడునైరుతికి నిరృతిపశ్చిమానికి వరుణుడువాయువ్యానికి వాయువుఉత్తరానికి కుబేరుడుఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు.


వాహ‌న‌సేవ‌లో టిటిడి జేఈవో శ్రీ వి.వీర‌బ్ర‌హ్మంసివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు  ఆలయ ప్ర‌త్యేకాధికారి డా.టి.ర‌విప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి  వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌సూపరింటెండెంట్‌  శ్రీ రాజ్‌కుమార్‌కంకణభట్టర్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న‌శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఇతర అధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments