తిరుపతి
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు, మదమోహ, మాత్సర్యాదులు సంహరించబడతాయి.
వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో గా భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments