తిరుపతి
జిల్లా, నాయుడుపేట మండలం, తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్యక్రమం శుక్రవారం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీ కే. నరసింగా రావు మరియు గ్రామస్థులు ఆలయానికి సంబంధించిన రికార్డులను టీటీడీ అధికారులకు అందించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయ సముదాయంలో ఈ ఆలయాన్ని చేర్చారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సూపరింటెండెంట్లు శ్రీ జ్ఞానప్రకాష్, శ్రీ ముని కుమార్, శ్రీ రాజేష్, ఆలయ అధికారులు శ్రీ మహేష్, శ్రీ రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments