- మార్చి 5న ఉత్తరా నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు.
- మార్చి 6, 13, 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆలయ మాడవీధుల్లో శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
- మార్చి 15న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
- మార్చి 16న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
- మార్చి 19న ఆలయంలో ఉగాది ఆస్థానం.
- మార్చి 24న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిస్తారు.
- మార్చి 26 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు పంగుణి ఉత్తర ఉత్సవం.
- మార్చి 27న శ్రీరామ నవమి.
- మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ గోవింద రాజస్వామి ఆలయం మూత.
No comments :
Write comments