5.2.26

శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు sri kalayana venkateswara swamy vari temple








శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు  విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మం అధికారులను ఆదేశించారుఫిబ్రవరి 8 - 16 తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవో బుధ‌వారం అధికారులతో ఆలయంలో సమీక్ష నిర్వహించారు.


 సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి 8 తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమైఫిబ్రవరి 16 తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారుశ్రీనివాసమంగాపురం ప‌రిస‌ర ప్రాంతాల గ్రామాల్లో ప్రచార రథాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు.


తిరుమల తరహాలో భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారుశ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టతబ్రహ్మోత్సవాలు,  వాహన సేవల ప్రాముఖ్యత దితర అంశాలపై ఎస్వీబీసీ , సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారుఅదేవిధంగాతిరుపతి ప్రధాన ప్రాంతాల్లోశ్రీనివాసమంగాపురం నలుమూలల విద్యుత్ లంకరణలు చేపట్టాలని సూచించారు


శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 12 తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం శోభాయాత్రగోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారుహిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టుదాససాహిత్య ప్రాజెక్టు  ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఆధ్యాత్మికధార్మిక కార్యక్రమాలువాహన సేవల ముందు భజనలుకోలాటాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా  ఏర్పాటు చేయాలన్నారు. 


 వాహన సేవల ఫిట్ నెస్ నుపార్కింగ్పుష్పాలంకరణలుక్యూలైన్లుచలువ పందిళ్లుమొబైల్‌ మరుగుదొడ్లుపారిశుద్ధ్యంపారామెడికల్ సిబ్బందిఅన్నప్రసాదాలు, శ్రీవారి సేవకులుతదితర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు మన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు


టీటీడీ విజిలెన్స్‌,  చంద్ర‌గిరి పోలీసులు సమన్వయం చేసుకుని టిష్టమైన భద్రతా ఏర్పాట్లుట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ చేపట్టాలని శాఖల వారీగా అధికారులకు సూచించారుబ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఇత‌ర విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీఆల‌య ప్ర‌త్యేకాధికారి మ‌రియు సీపీఆర్వో డా.ర‌వికి సూచించారు.


అనంతరం జేఈవో ఆలయ నాలుగు మాడ వీధుల్లోవాహన మండపంలో జరుగుతున్ ఏర్పాట్లను ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించిప‌లు సూచ‌న‌లు చేశారు.


 సమావేశంలో ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులుడెప్యూటీ ఈవోలు శ్రీమతి వి.ఆర్శాంతిశ్రీ సెల్వంఎస్వీబీసీ ఇన్ చార్జ్ సిఈవో శ్రీ డిఫ‌ణికుమార్ నాయుడుఎస్ఇ ఎలక్ట్రికల్ శ్రీ వెంకటేశ్వర్లువిజివో శ్రీ గిరిధ‌ర్‌అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ఏఈవో శ్రీ గోపీనాథ్‌ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments