7.2.26

శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయ విమాన, అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ‌ కరపత్రికలు ఆవిష్కరించిన టీటీడీ ఈవో sri vedanarayaana swamy




నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 22 తేదీ వ‌ర‌కు విమాన జీర్ణోద్ధరణ అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాల కరపత్రికను టిటిడి నూతన ఈవో శ్రీ ఎం.రవిచంద్ర ఆవిష్కరించారుతిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో శుక్రవారం సాయంత్రం  కార్యక్రమం జరిగింది


 సందర్భంగా ఈవో మాట్లాడుతూఫిబ్రవరి 17 నుండి 22 తేదీ వరకు జరగనున్న రాజగోపురఅష్ట బంధన హా సంప్రోక్షణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.


ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 17 సాయంత్రం 5.30 గంట‌ల‌కు ఆచార్య ఋత్విక్ వర‌ణం,  పుణ్య‌హ‌ం మృత్సంగ్రహణంఅంకురార్ప‌ణం జరుగునుంది.


ఫిబ్రవరి 18 ఉద‌యం అష్ట బంధన మర్పణసాయంత్రం పుణ్యాహంపంచాగ్ని ప్రతిష్ఠకుంభ వాహనంఆరాధనహోమంపూర్ణాహుతిఫిబ్రవరి 19 పంచ గవ్యాధివాసంనవ కలశ స్నపనం నిర్వహించనున్నారు.


ఫిబ్రవరి 20 ఉద‌యం క్షీరాబ్ధివాసంసాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు,   ఫిబ్రవరి 21 ఉదయం జలాధివాసం, సాయంత్రం మహా శాంతి తిరుమంజనం జరగనుంది.


ఫిబ్రవరి 22 ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణంఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గర్భాలయ మూలవర్ల మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారుఅనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.


 కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి,  జేఈవోలు శ్రీ వి.వీరబ్రహ్మండా.శరత్డిప్యూటీ ఈవో  శ్రీ సి. గోవిందరాజన్ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ధర్మయ్యఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments