VIDEO
శ్రీనివాసమం
గాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్ వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఉదయం 8 గంటల కు ఆదిత్య మండలం సూర్యప్రభ వా హనంపై ఖడ్గం , గద , విల్లు ధరించి శ్రీ సూర్యరాయణస్వామి అలంకా రంలో భక్తులకు దర్శనమిచ్చారు .
వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుం డగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్ తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జ రిగింది. భక్తులు అడుగడుగునా కర్పూ ర హారతులు సమర్పించి స్వామివారి ని దర్శించుకున్నారు.
ఆయురారోగ్యప్రాప్తి :
సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరో గ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్ర దాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూ డా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్ తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వా హనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూ ర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్ నారాయణుడే. అందుకే సూర్యుని సూ ర్యనారాయణుడు అని కొలుస్తున్నాం . ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్ యప్రభ వాహనంలో ఉండే సూర్యనారా యణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభా గ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురా రోగ్యాలు సిద్ధిస్తాయి.
వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్ రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరిం టెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, ఆల య అర్చకులు శ్రీ బాలాజీ రంగాచా ర్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 15 న రథోత్సవం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివా రి బ్రహ్మోత్సవాల్లో 8 వ రోజైన ఆదివారం రథోత్సవం వైభవంగా జరు గనుంది. ఉదయం 6.30 గంటలకు స్వా మివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7.45 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వా మివారు విహరించి భక్తులను కటాక్ షించనున్నారు.
No comments :
Write comments