28.2.26

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం teppotsavam







తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.


ముందుగా స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారురాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడుసార్లు విహరిస్తూ భ‌క్తుల‌ను క‌టాక్షించారువేదంగానంనాదం మ‌ధ్య తెప్పోత్స‌వం వేడుక‌గా జ‌రిగింది.


కాగామూడవరోజు శ్రీదేవిభూదేవి సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుసార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.


 కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిజేఈవో (విద్యా&ఆరోగ్యండాక్టర్ .శరత్సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలువురు బోర్డు సభ్యులుఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments