2.2.26

వైభ‌వంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు tepppostsavams






తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామివారి తెప్పోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామిఅమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారుఅనంత‌రం  శ్రీదేవిభూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భ‌క్తుల‌ను క‌టాక్షించారుఅనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలుహరికథసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ్య‌ర్ స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతిఏఈవో శ్రీ నారాయణ చౌదరి,, ఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments