18.2.26

తొండమాన్ పురంలో హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామిThondamanpuram




తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి నెల  16 తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు  నెల 24 తేదీ వరకు జరుగనున్నాయి.  ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జ‌రుగ‌నున్నాయిబ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రెండోవ రోజు శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారు హంస వాహనంపై ఊరేగారు.


ఫిబ్ర‌వ‌రి 18 సింహ వాహనంఫిబ్ర‌వ‌రి 19 హనుమంత వాహనంఫిబ్ర‌వ‌రి 20 సాయంత్రం 5 గంట‌ల‌కు కల్యాణోత్సవంరాత్రి గరుడ వాహన సేవ అత్యంత వైభ‌వంగా సాగనున్నాయిఫిబ్ర‌వ‌రి 21 గజవాహనంఫిబ్ర‌వ‌రి 22 చంద్రప్రభ వాహనంఫిబ్ర‌వ‌రి 23 ఉదయం తిరుచ్చిరాత్రి అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు.


ఫిబ్ర‌వ‌రి 24 ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు చక్రస్నానంసాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారుఫిబ్ర‌వ‌రి 25 సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.


బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వాహన సేవల ముందు ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

No comments :
Write comments