15.2.26

వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామి స్నపన తిరుమంజనం tirumanjanam






శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామిఅమ్మవార్లకు శ‌నివారం స్నపన తిరుమంజనం (పవిత్రస్నానంశాస్త్రోక్తంగా నిర్వహించారుఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో  విశేష ఉత్సవం నిర్వహించారు.


ఇందులో ముందుగా విష్వక్సేనారాధనపుణ్యహవచనంనవకలశాభిషేకంరాజోపచారం నిర్వహించారుఅనంతరం త్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యంముఖ ప్రక్షాళనధూపదీప నైవేద్యం చేపట్టారుఅర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలుపెరుగు,తేనె, కొబ్బరినీళ్లుపసుపుగంధంతో స్నపనం నిర్వహించారు.


 సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తుపురుషసూక్తంశ్రీసూక్తంభూసూక్తంనీలాసూక్తంపంచశాంతి మంత్రములుదివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున తామ‌ర పూలురోజాతామ‌ర గింజ‌లు,  వివిధ ర‌కాల సాంప్ర‌దాయ పుష్పాలుతుల‌సీ తదితర ఏడు రకా మాలలను స్వామిఅమ్మవార్లకు లంకరించారు.


 కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న శేఖ‌ర్‌ల‌య అర్చ‌కులువిశేష సంఖ్యలో క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments