21.2.26

వేసవి రద్దీకి విస్తృత ఏర్పాట్లు - టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిttd addl eo

త్వరలో ప్రారంభం కానున్న వేసవి సెలవులకు రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కల





గకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారుతిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన వేసవి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండుమూడు సంవత్సరాల వేసవి డేటాను విశ్లేషించిదర్శనాల సంఖ్వేచి ఉండే సమయంతర్వాత రోజు దర్శనాలకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సంఖ్య వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.


భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్నప్రసాదంతాగునీటి పంపిణీనడక దారి భక్తులకు మార్గమధ్యంలో షెడ్ల ఏర్పాటుమాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్అవసరమైన చోట్ల షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారుఅలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.


వేసవి సెలవుల్లో కుటుంబాలతో కలిసి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో వసతి సదుపాయాలుఅన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారునడకదారి భక్తులుఅధిక రద్దీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేసి మరిం మెరుగైన సేవలు అందించేందుకు ర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.


సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి వీలైనంత త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అదనపు ఈవో తెలిపారుఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచిగంటల వారీగా ఇన్అవుట్ ఫ్లోవేచి ఉండే సమయాన్ని ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.


వివిధ కేటగిరీల దర్శనాలను డేటా ఆధారంగా హేతుబద్ధంగా కంపార్ట్మెంట్లుక్యూ లైన్లలో భక్తులు వేగంగా దర్శనం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


గత వేసవిలో జూన్ నెలలో సగటున రోజుకు 80 వేల నుంచి 82 వేల మందికి దర్శనం కల్పించామనిఅలాగే 2026 జనవరిలో రోజుకు సగటున 74 వే మందికి పైగా దర్శనం కల్పించినట్లు గుర్తు చేశారుఇది సమర్థవంతమైన టైమ్ మేనేజ్‌మెంట్అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైందని వివరించారు.


వేసవిలో భక్తులకు వేగవంతమైనసౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే క్ష్యంగా టీటీడీ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని అదనపు ఈవో  సందర్భంగా స్పష్టం చేశారు.


 సమావేశంలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణట్రాన్స్ పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డిడిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథంశ్రీ భాస్కర్, శ్రీ సోమన్నారాయణశ్రీ వెంకటయ్యశ్రీ వేంకటేశ్వర్లువీజీవో శ్రీ సురేంద్రఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments