4.2.26

టిటిడి ఉన్నత పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి: టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ ttd jeo (H&E)







టిటిడి ఉన్నత పాఠశాలలలో విద్యార్థులు రాష్ట్రజిల్లా స్థాయిలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని టిటిడి జేఈవో (వైద్యం & విద్యడాశరత్ అధికారులకు సూచించారు.


తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఉన్నత పాఠశాలను ఆయన అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు సందర్భంగా పాఠశాల విద్యా ప్రమాణాలుబోధనా విధానాలువిద్యార్థుల ప్రగతిని ఆయన సమీక్షించారు.


జేఈవో మాట్లాడుతూప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను మరింత జాగురూకతతో తయారు చేయాలని అధ్యాపకులకు సూచించారురాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో ప్రథమ స్థానాలు సాధించేలా లక్ష్యంతో విద్య బోధించాలని కోరారు.


వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించివారికి సులభమైన పద్ధతుల్లో అవగాహన ల్పిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారుటిటిడి విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనిఉపాధ్యాయులు ఆసక్తితోఅత్యుత్తమ ప్రమాణాలతో బోధన చేపట్టాలని చెప్పారువిద్యార్థుల ప్రతిభను పెంపొందించేందుకు రోజువారీవారాంత పరీక్షలు నిర్వహించివారి ప్రగతిని నిరంతరం పరిశీలించాలని సూచించారు.


 కార్యక్రమంలో టిటిడి డీఈవో శ్రీ వెంకట సునీలుఎస్.జీ.ఎస్న్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రయ్యఎస్. శ్రీ మనోహరంఅదనపు హెల్త్ ఆఫీసర్ డాసునీల్ఉపాధ్యాయులుపలువురు అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments