19.2.26

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి : ttd jeo











ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5 తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1 జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని టిటిడి జెఈవో శ్రీ వివీర‌బ్ర‌హ్మం అధికారుల‌ను ఆదేశించారుప్ప‌టివ‌ర‌కు చేప‌ట్టిన బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల ప‌నులుప్ర‌స్తుతం జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులుభ‌విష్య‌త్తులో చేప‌ట్టాల్సిన ప‌నుల‌ను ప‌రిశీలించిఅన్ని విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.


 సంద‌ర్భంగా జెఈవో అధికారుల‌తో క‌లిసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాలముడి సరుకులు నిల్వ‌ ఉంచే షెడ్లను పరిశీలించిసకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారుఅదేవిధంగా భక్తులకు అన్నప్రదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబులుకుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారుఆలయంలోనుయాగశాలలో మరమత్తు పనులు త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌న్నారుటిటిడి స్థానిక ఆలయాల్లో  విధంగా యితే శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో వినియోగించుకోవాల‌ని సూచించారుఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించారు.


అనంత‌రం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారుభక్తులకు తలంబ్రాలున్న‌ప్ర‌సాదాలు అందించే 17 కౌంటర్లుప్రవేశనిష్క్రమణ గేట్లను పరిశీలించారుకల్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ ఉన్న జల ప్రసాదమును వినియోగంలోకి తీసుకురావాలన్నారుకల్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు


ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు రోడ్డు ఇరువైపుల మొక్కలు పెంచాలని సూచించారుకళ్యాణ వేదిక వద్ద విఐపిలు బస చేసేందుకు అవసరమైన ర్పాట్లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలన్నారుకల్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వంటశాల స్థలాన్ని పరిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.


అటు తర్వాత జేఈవో అధికారుల‌తో నిర్వ‌హించిన సమీక్ష స‌మావేశంలో మాట్లాడుతూభక్తులకు సౌకర్యవంతంగా క్యూలైన్లువసతి షెల్టర్లు, సూచిక బోర్డులుతాగునీటి సౌకర్యంతదితర ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారురథం తిరిగే వీధులనుముఖ్యంగా మాడ వీధుల్లో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారుభక్తులను ఆకట్టుకునేలా కటౌట్లు,  విద్యుత్ దీపాలంకరణలుపుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు.


బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని విభాగాల సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించాలన్నారుభ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాం క‌లుగ‌కుండా ప్రధమ చికిత్స కేంద్రాలు,  నిపుణులైన వైద్య సిబ్బందిమందులుఅంబులెన్స్‌లు ఏర్పాటు చేయాల‌న్నారుపబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా నిరంతరాయంగా శ్రీరామనామం ప్రసారం చేయాలన్నారుబ్రహ్మోత్సవాలకు ముందు 10 రోజులపాటు ప్రచార ర‌థాల‌ ద్వారా పరిసర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనిబ్ర‌హ్మోత్స‌వాల కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు.


స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారుభక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగతాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారుటీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రతపార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళి సిద్ధం చేయాలని సూచించారుబ్రహ్మోత్సవాల వాహ‌న‌ సేవ‌లను భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్..డి స్క్రీన్ లు ఏర్పాటు చేయాలనిహిందూధర్మ ప్రచార పరిషత్ ధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలుకవి సమ్మేళనము ఏర్పాటు చేయాల‌న్నారుబ్రహ్మోత్సవాల వాహన సేవల ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజ బృందాలచే ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఉండాలనిఅలాగే కల్యాణోత్సవం రోజున చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.  


ఒంటిమిట్ట ఆలయ పునఃనిర్మాణానికి కృషి చేసిన‌ శ్రీ వావికొలను సుబ్బారావు రచించిన కీర్తనలను ముద్రించిపుస్త‌కాలను భ‌క్తుల‌కు పంపిణీ చేయాలన్నారుటీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు


 కార్యక్రమంలో సిఈ శ్రీ టి.వి.సత్యనారాయణ,  ఎస్ఇలు శ్రీ మనోహర్శ్రీ నరసింహమూర్తిఎస్ఇ (ఎలక్ట్రికల్శ్రీ వెంకటేశ్వర్లుసిపిఆర్ఓ డాటి.రవిసీఎంవో డా.కుసుమ కుమారిఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిఅదనపు ఆరోగ్యశాఖ అధికారి శ్రీ డాసునీల్డిపిపి ప్రత్యేక అధికారి శ్రీ రఘునాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments