టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి బుధవారం రూ.10 లక్షల విరాళం అందింది.
విజయవాడలోని ఆయూష్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు డా. ఉప్పాల చక్రపాణి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని అందించారు.
తిరుపతిలోని టీటీడీ ఈవో నివాసంలోని ఛాంబర్‌లో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకి డీడీని దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. కోడెల శివరామకృష్ణ పాల్గొన్నారు.
No comments :
Write comments