9.3.26

మార్చి 13న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం koil alwar tirumanjanam




తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 13 తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారుఆలయంలో మార్చి 17 నుండి 25వ‌ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా మార్చి 13న‌ తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవకొలువుపంచాంగశ్రవణం నిర్వహిస్తారుఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.


ఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర  వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఅనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

No comments :
Write comments