6.3.26

మార్చి 17న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం




తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19 ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 17 తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది.


ఉగాదిఆణివార ఆస్థానంబ్రహ్మోత్సవంవైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ.


వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు 


కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17 వీఐపీ బ్రేక్ దర్శనాలుఅష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16 తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.


అదేవిధంగా మార్చి 19 ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది కారణంగా మార్చి 18 తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

No comments :
Write comments