VIDEO
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మా ర్చి 24 వ తేదీన కోయిల్ ఆళ్వా ర్ తిరుమంజనం నిర్వహించనున్నా రు . ఆలయంలో మార్చి 26 నుండి ఏప్ రిల్ 05 వ తేదీ వరకు బ్రహ్మో త్సవాలు జరుగనున్న నేపథ్యం లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ .
ఈ సందర్భంగా మార్చి 24 న తెల్లవా రుజామున సుప్రభాతంతో స్వామివారి ని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయం లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పై కప్పు, పూజాసామగ్రి తదితర అని వ స్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూ రి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూ రం, గంధం పొడి, కుంకుమ, కిచీలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగ లిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అం తటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్ తారు.
మార్చి 25 న పసుపు దంచే కార్యక్ రమం :
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25 న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు . మార్చి 27 న ప్రారంభము కానున్ న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగం గా ఏప్రిల్ 01 వ తేదీ అత్యంత వై భవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్ యాణంలో ఈ పసుపును వినియోగించను న్నారు.
No comments :
Write comments