VIDEO
ఒంటిమిట్టలోని
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నిర్వహించనున్న వార్షిక శ్రీరా మనవమి బ్రహ్మోత్సవాలకు భక్తి భా వపూర్వక వాతావరణంలో వేదమంత్రాల నడుమ గురువారం రాత్రి శాస్త్రో క్తంగా అంకురార్పణ జరిగింది .
పురాతన చారిత్రక ప్రాశస్త్యాన్ ని కలిగిన ఈ ఆలయంలో ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్య మూర్ తులు వెలసి ఉండటంతో ఒంటిమిట్టను “ ఏకశిలానగరం” గా కూడా పిలుస్తా రు. ఈ పవిత్రక్షేత్రంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 5 వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల కోసం ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో ముస్తాబైం ది.
గురువారం ఉదయం సుప్రభాత సేవతో స్వా మివారిని మేల్కొలిపి, పరివార దే వతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చనలను శాస్త్రోక్తం గా చేశారు. సాయంత్రం 6 గంటల నుం డి అర్చకుల వేదమంత్రాల నడుమ అం కురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్ వహించారు.
ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్ మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుం దరంగా అలంకరించి ప్రత్యేక వేది కపై కొలువుదీర్చి విష్వక్సేన పూ జ, కలశ ప్రతిష్ఠ, కలశపూజ, వాసు దేవ పుణ్యాహవచనం, కంకణధారణ వంటి శాస్త్రోక్త కర్మలను నిర్వహిం చారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరి గింది.
మార్చి 27 న ధ్వజారోహణం
శుక్రవారం ఉదయం 9.30 నుండి 10. 15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్ వజారోహణం నిర్వహించనున్నారు. దీం తో శ్రీ కోదండరామస్వామివారి వా ర్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రా రంభం కానున్నాయి.
అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్ యాహ్నం 12 గంటల వరకు శ్రీరా మనవమి ఆస్థానం నిర్వహిస్తారు. సా యంత్రం 4 నుండి 7 గంటల వరకు పో తన జయంతి కార్యక్రమం, కవి సమ్మే ళనం జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవను భక్ తులు వీక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్ రీ బాలరాజు, సూపరింటెండెంట్ శ్ రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పె క్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments