10.3.26

32 మంది మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డులు మహతి కళాక్షేత్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు women day celebrations









భారతీయ కుటుంబ వ్యవస్థకు మహిళ మూలస్తంభమనిపండితులకు వేదం ఎంత పవిత్రమో గృహాలకు గృహలక్ష్మి అంతే పవిత్రమని టీటీడీ జేఈవో (విద్యవైద్యండాశరత్ పేర్కొన్నారుటీటీడీ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూ కుటుంబ నిర్మాణంసమాజ అభివృద్ధి, దేశ ప్రగతిలో మహిళల పాత్ర అత్యంత కీలకమన్నారుప్రతి మనిషికి తల్లి మొదటి గురువనిపిల్లలకు ధర్మంసంస్కారంవిలువలు నేర్పేది తల్లేనని తెలిపారుతల్లి సద్గుణవంతురాలైతే కుటుంబం సుస్థిరంగా ఉంటుందనికుటుంబం బాగుంటే సమాజం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారుసమాజం భివృద్ధి చెందితే రాష్ట్రందేశం కూడా ప్రగతి మార్గంలో ముందుకు సాగుతాయని అన్నారుమహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా మార్గదర్శకులుగా నిలుస్తారని వివరించారు.


టీటీడీ బోర్డు సభ్యురాలు శ్రీమతి పనబాక లక్ష్మి మాట్లాడుతూ సనాతన ధర్మంలో మహిళకు అత్యున్నత స్థానం కల్పించబడిందన్నారుస్త్రీని దేవతగా పూజించే సంప్రదాయం భారతదేశానికి ప్రత్యేకమని తెలిపారుమహిళలు విద్యావంతులైతే కుటుంబంసమాజం అభివృద్ధి చెందుతాయని చెప్పారునేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ సమాజ పురోగతికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు.


న్యూఢిల్లీకి చెందిన మిత్రావక్ మరియు డిజిటల్ మహిళ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శ్రీమతి ఆశ్లేష మాట్లాడుతూమహిళల్లో అపారమైన శక్తిచైతన్యం నిక్షిప్తమై ఉందన్నారుభారతీయ సంస్కృతిలో మహిళలకు ఉన్న గౌరవస్థానం ప్రపంచానికి ఆదర్శమని తెలిపారుఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ సుఖశాంతులుఐశ్వర్యం వర్థిల్లుతాయని పేర్కొన్నారు.


డిఆర్‌డిఓ శాస్త్రవేత్త డాచంద్రిక కౌశిక్ మాట్లాడుతూ,  సమాజంలో సానుకూల మార్పు రావాలంటే హిళలు ముందుగా తమను తాము ప్రాధాన్యంగా భావించాల్సిన అవసరం ఉందన్నారుకుటుంబ సభ్యులు బాధ్యతలను పంచుకుంటే మహిళలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారుఇంటి పనులుపిల్లల సంరక్షణ వంటి బాధ్యతలను కుటుంబ సభ్యులు కలిసి పంచుకోవడం ద్వారా సమతుల్య జీవనం సాధ్యమవుతుందని సూచించారు.


పద్మావతి అవార్డులు


టీటీడీలోని పలు విభాగాల్లో విశే సేవలు అందిస్తున్న 32 మంది మహిళా ఉద్యోగులకు  సందర్భంగా పద్మావతి అవార్డులు ప్రదానం చేశారువారిని శాలువాతో సత్కరించి, 5 గ్రాముల వెండి డాలర్ మరియు శ్రీ పద్మావతి అమ్మవారి జ్ఞాపిక అందజేశారు.


అదేవిధంగా రాబోయే ఏడాది కాలంలో పదవీ విరమణ చేయనున్న 78 మంది మహిళా ఉద్యోగులను కూడా శాలువాజ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.


 కార్యక్రమంలో భాగంగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులువిద్యార్థుల బృందం ప్రదర్శించిన భరతనాట్యంవీణా వాద్యకచేరి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయిమహిళా ద్యోగుల కోసం నిర్వహించిన వ్యాసరచనపెయింటింగ్క్విజ్గాత్ సంగీత పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారుటీటీడీ హిళా ఉద్యోగులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి.


 కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాకృష్ణవేణిటీటీడీ పీఆర్వో (ఫ్‌ఏసీకుమారి పినీలిమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.


 కార్యక్రమంలో సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజుపలువురు మహిళా డిప్యూటీ ఈఓలుఇతర అధికారులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments :
Write comments