19.3.26

అన్నమయ్య సాహిత్యంలో తెలుగు వివాహ సంప్రదాయాల వెలుగు - డా.ఉషారాణి annamaya






అన్నమయ్య కీర్తనల్లో తెలుగు వివాహ సంప్రదాయాలుఆచారాలు సజీవంగా ప్రతిబింబించినట్లుభక్తిసాంస్కృతిక విలువలను సమన్వయంతో తెలియజేస్తాయని చిత్తూరు ప్రభుత్వ కళాశాల తెలుగుశాఖాధ్యక్షులు డాఉషారాణి పేర్కొన్నారుశ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 523 వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు బుధవారం మూడవ రోజుకు చేరుకున్నాయి.


 సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్య‌క్ష‌త వ‌హించిన డా.ఉషారాణి “అన్నమయ్య – కళ్యాణ సంకీర్తనలు” అనే అంశంపై ఉపన్యసిస్తూఅన్న‌మ‌య్య‌ కాలంలోని సామాజిక పరిస్థితులుసంప్రదాయాలను ఆయన కళ్యాణ కీర్తనల్లో ప్రతిబింబించారని తెలిపారుశ్రీ వేంకటేశ్వర స్వామిశ్రీ అలమేలు మంగల అమ్మవారి దివ్య కల్యాణాన్ని వర్ణించే  పెళ్లి పాటలు తెలుగు వివాహాలలో ప్రధానంగా వినిపిస్తూఆచార వ్యవహారాలు మరియు భక్తి భావాలను సమన్వయంగా ప్రతిబింబిస్తాయని చెప్పారుమంగళహారతులుతలంబ్రాల పాటలునలుగు పాటలు వంటి వివాహ సంప్రదాయాలు అన్నమయ్య సంకీర్తనల్లో విశిష్ట స్థానం పొందినట్లు ఆమె వివ‌రించారు.


టీటీడీ ప్ర‌చుర‌ణ‌ల విభాగం ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య‌ ''న్నమయ్య - నరసింహ కీర్తనలు'' అనే అంశంపై , హంపిలో 1400 సంవత్సరానికి శ్రీ నారసింహ ఆలయం ఉన్నట్లుఅన్నమయ్య ఆరు కీర్తనలలో శ్రీ నారసింహస్వామిని కీర్తించినట్లు వివరించారుఅన్నమయ్య హంపిలోని వివిధ ఆలయాలను దర్శించి నాటి వైభవాన్నిసామాజిక జీవనాన్ని కూడా అద్భుతంగా వర్ణించారని ఆయన తెలిపారుఅన్నమయ్య దర్శించిన క్షేత్రాలుప్రాంతాలను సంకీర్తనల్లో పొందుపరచడం వల్ల నాటి చరిత్రను తెలియజేశారని తెలిపారుఅప్పటి వరకు ఉన్న పద్య, గద్యం కాకుండా పద కవితలతో జన బాహుళ్యంలోకి భక్తి తత్వన్ని తీసుకు వెళ్ళిన్నట్లు తెలిపారు.


తిరుప‌తికి చెందిన విశ్రాంతాచార్యులు డా.వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి అన్న‌మ‌య్య - తాత్త్విక‌త‌ " అనే అంశంపై ఉపన్యసిస్తూవైరాగ్యంవిరక్తికోర్కేలు లేక‌ పోవడం వంటి వాటిని ప్ర‌భోదిస్తూప్ర‌జ‌ల‌ను ఆధ్యాత్మికతమోక్ష మార్గంలో న‌డేపేందుకు అన్న‌మ‌య్ సంకీర్తనను రచించిట్లు తెలిపారువేదాంతాన్ని భక్తి అనే రసగుళిక ద్వారా సామాన్య ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అన్నారునామ సంకీర్తననామ జపంతో జాతికులమతాలకతీతంగా భగవంతుని చేరవచ్చ‌ని తెలిపారుశ్రీవారిని సంకీర్తన ద్వారా సామాన్యులకు చేరువ చేసేందుకు అన్నమయ్య కృషి చేసినట్లు వివరించారు.


 కార్య‌క్ర‌మంలో టీటీడీ అన్న‌మాచార్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా.మేడ‌సాని మోహ‌న్సంచాల‌కులు శ్రీ‌మ‌తి ల‌త‌ఇత‌ర అధికారులుపుర ప్ర‌జ‌లు పాల్గొన్నారు.


అన్న‌మాచార్య క‌ళామందిరంలో :


తిరుపతిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో సాయంత్రం 6 గంటలకు విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీ కోదండ‌రామ‌య్య‌ బృందంరాత్రి 7 గంటలకు తిరుప‌తికి  చెందిన శ్రీ‌ర‌ఘునాథ్‌ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.


మహతి కళాక్షేత్రంలో :


మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి బుల్లెమ్మ‌ బృందం,  రాత్రి 7 గంట‌ల‌కు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి శ్రీ‌దేవి బృందం సంగీత స‌భ జ‌రుగ‌నుంది.

No comments :
Write comments