శ్రీవారి
దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి నిలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలు పుష్ప గుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీమతి జానకిదేవి, జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, డాక్టర్ ఏ.శరత్, టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
No comments :
Write comments