21.3.26

కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అభ‌యం








తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం ఉదయం 8 గంట‌ల‌కు కల్పవృక్ష వాహనంపై స్వామివారు
 భక్తులను అభ‌య‌మిచ్చారు.


 ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


 ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టుఅందులో మేటి కల్పవృక్షంకల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుందిఅటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు.


 అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమే శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంలతో అభిషేకం చేశారు.


 వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న,  సూపరింటెండెంట్‌ శ్రీ మునిశంక‌ర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్శ్రీ హరీష్అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments