28.3.26

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం brahmotsavams







ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయిఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృష‌భ‌ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వ‌హించారుకంకణబట్టర్‌ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో  కార్యక్రమం జరిగింది.


ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్టనేత్రోల్మీలనం నిర్వహించారుధ్వజస్తంభానికి వకలశ పంచామృతాభిషేకం చేసినట్టు చెశారురాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలనునవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి ధ్వజారోహణం నిర్వ‌హించారు.

 సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు.


 కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీమ‌తి ప్ర‌శాంతిశ్రీ . శివ‌ప్ర‌సాద్‌ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments