17.3.26

జూన్ నెల దర్శన కోటా విడుదల వివరాలు darshan quota




2026 జూన్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాలగదుల కోటా వివరాలు  విధంగా ఉన్నాయి.


తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లసుప్రభాతంతోమాలఅర్చనఅష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన కోటాను మార్చి 18 ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


 సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20 తేదీ ఉదయం 1గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.


 టికెట్లు పొందిన వారు మార్చి 20 నుండి 22 తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.


21 ఆర్జిత సేవా టికెట్ల విడుదల


కల్యాణోత్సవంఊంజల్ సేవఆర్జి బ్రహ్మోత్సవంసహస్రదీపాలంకార సేవజ్యేష్ఠాభిషేకం టికెట్లను 21 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.


వర్చువల్ సేవల కోటా విడుదల


వర్చువల్ సేవలువాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


23 అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల


అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.


శ్రీవాణి దర్శన కోటా విడుదల


శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.


వృద్ధులుదివ్యాంగుల దర్శన కోటా


వ‌యోవృద్ధులుదివ్యాంగులుదీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23 మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.


24 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల


ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


తిరుమ‌ల‌తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌


తిరుమలతిరుపతిల‌లో గదుల కోటాను 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.


https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లుద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

No comments :
Write comments