22.3.26

గరుడ వాహనంపై లోకాభి రాముడు garuda vahanam







తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు


రాత్రి 7 గంటలకు సేవ ప్రారంభమైంది.  భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనదిగరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనందాసుడుగాసఖుడుగావిసనకఱ్ఱగాచాందినిగాఆసనంగాఆవాసంగావాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.


వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామిజెఈఓ శ్రీ వివీరబ్రహ్మంఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న ,  సూపరింటెండెంట్‌ శ్రీ ముని శంక‌ర్‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్‌ఆలయ అర్చకులువిశే సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments