14.3.26

కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ బి.ఆర్. నాయుడు keesaragutta





తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టిటిడి ఛైర్మెన్ శ్రీ బి.ఆర్నాయుడు శుక్రవారం సందర్శించారు.


శ్రీ ఎస్వీ వేద పాఠశాలకు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారుఅనంతరం వేదాశీర్వచనాల మధ్య ప్రార్థనా మందిరానికి చేరుకునివేద పండితులు మరియు విద్యార్థులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

తరువాత వేద పండితులు ఆయనకు పుష్పమాలఫలాలుశాలువాతో సత్కారం చేశారు.


 సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల గురించి టిటిడి ఛైర్మెన్ వివరాలు తెలుసుకున్నారుపాఠశాల ఎప్పుడు స్థాపించబడిందిప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు వే విద్యను అభ్యసిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారుఅలాగే వేద విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.


వేద పండితులువిద్యార్థులు మరియు సిబ్బందికి సమస్యలు ఉన్నాయా అని కూడా తెలుసుకున్నారుపాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులు మరియు అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేశారు.


 సందర్భంగా వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ గూడ శ్రీనివాస శర్మ అవధాని మాట్లాడుతూ పాఠశాల 1981 సంవత్సరంలో స్థాపించబడిందనిప్రస్తుతం 132 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారని టిటిడి ఛైర్మెన్‌కు తెలిపారు.


 కార్యక్రమంలో అధ్యాపకులుఇంజనీరింగ్ అధికారులు డీఈ శ్రీ రామకృష్ణజేఈ శ్రీ చలమా నాయక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

No comments :
Write comments