14.3.26

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం koil alwar tirumanjanam







తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగిందిఆలయంలో మార్చి 17 నుండి 25 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమేబ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవసహస్రనామార్చన నిర్వహించారుఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగిందిఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసిపసుపుకుంకుమచందనంకర్పూరంకిచిలిగడ్డకస్తూరి పసుపుపచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని ర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేశారుఅనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.


ఆలయానికి పరదాలు విరాళం :


శ్రీ కోదండరామాలయానికి శుక్ర‌వారం హైదరాబాదుకు చెందిన శ్రీమతి ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు నాలుగుతిరుప‌తికి చెందిన శ్రీ మ‌ణి అనే భ‌క్తుడు రెండు పరదాలు విరాళంగా అందించారు.


 కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ వో శ్రీమతి నాగ‌ర‌త్న‌,  ప్ర‌ధా అర్చ‌కులు శ్రీ ఎపి.ఆనంద‌కుమార్ దీక్షితులుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్‌ఇతర అధికారులుఅర్చకులు పాల్గొన్నారు.


మార్చి 16 అంకురార్పణ :


శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు మార్చి 16 తేదీ రాత్రి 7 నుండి 8.30 గంటల వ‌ర‌కు ఘనంగా అంకురార్పణ జరుగనుంది సందర్భంగా సేనాధిపతి ఉత్సవంమేదిని పూజమృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.


No comments :
Write comments