20.3.26

టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు local temples








టిటిడి అనుబంధ ఆలయాల్లో గురువారం శ్రీ ప‌రాభ‌వనామ‌  సంవత్సర  ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయితిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతిరుపతి శ్రీ గోవిందరాజస్వామిశ్రీకోదండరామాలయంఅప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామినాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామిశ్రీనివాసమంగాపురం,  నారాయణవనంలలోని  శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి స్వామివారి  ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది సందర్భంగా పాలు, పెరుగుచందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.


అనంతరం సాయంత్రం 6 గంటలకు నుంచి పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు


 రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు


అదేవిధంగా శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం నిర్వహించారుసాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు స్థానం చేపట్టారు.  


శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో :


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలకొలువు నిర్వహించారుసాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పంచాంగ శ్రవణంఉగాది ఆస్థానం చేపట్టారు.


శ్రీ కోదండరామాలయంలో :


తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానంపంచాంగ శ్రవణం నిర్వహించారు సందర్భంగా జీయర్‌ స్వామివారు మూలవర్లకుఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు.


ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో :


శ్రీ కోదండ రామాలయంలో గురువారం ఉదయం  10.30 నుండి 11.30 గంటల వరకు ఉగాది ఆస్థానం పంచాంగ శ్రవణం నిర్వహించారు.


శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యా వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో :


శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 1గంటల వరకు ఉగాది ఆస్థానంపంచాంగ శ్రవణం నిర్వహించారు.


అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో :


శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 8.30 నుండి 9.30 గంటల వరకు ఉగాది ఆస్థానంపంచాంగ శ్రవణం జరిగింది.


నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో :


శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో సాయంత్రం 5.30 నుండి 6.45 గంటల వరకు ఉగాది ఆస్థానంపంచాంగ శ్రవణం నిర్వహించారు.


నాగ‌లాపురం శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో :


శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉగాది ఆస్థానంపంచాం శ్రవణం శాశ్వతంగా జరిగింది.


 ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో :


అదేవిధంగా కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివాల్మీకిపురం శ్రీ కోదండ‌రామ‌స్వామిత‌రిగొం శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ‌స్వామిఇత‌ర అనుబంధ ఆల‌యాల‌లో గురువారం ఉగాది ఆస్థానం ఘ‌నంగా నిర్వహించారు.


 కార్యక్రమాల్లో ఆయా ఆలయాల అధికారులుఅర్చకులుభక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments