23.3.26

హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం manuman vahanam












తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు.


గజరాజులువృషభాలుఅశ్వాలు ముందు కదులుతుండగాభజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆల నాలుగు మాడవీధుల్లో విహరించారు.


త్రేతాయుగంలో రామభక్తునిగాభగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడుహనుమంతుడు తనను సేవించే భక్తులకు త్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు.


అనంతరం ఉదయం 10.30 గంటల నుండి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బ‌రినీళ్ళుప‌సుపుచందనంలతో అభిషేకం చేశారు.


రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు గజ వాహనంపై రాములవారు భక్తులకు కనువిందు చేయనున్నారు.


వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిడెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆల‌య అర్చ‌కులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments