20.3.26

ఉగాది సందర్భంగా తిరుమలలో “స్వర సంగమం” భక్తులను మైమరపించిన భక్తి సంగీత విభావరిswara sangamam






ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాదనీరజనం వేదికపై గురువారం సాయంత్రం నిర్వహించిన “స్వరసంగమం” క్తి సంగీత కార్యక్రమం భక్తులను సంగీత తరంగాల్లో ముంచెత్తింది.


స్వర సంగమం” అనే  ప్రత్యేక సంగీత సమ్మేళనం ఉగాది శుభసందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక సంగీతానుభూతిని అందించిందిశాస్త్రీయ సంగీతంపాప్ మరియు ఫ్యూజన్ రంగాల్లో తన ప్రత్యేక శైలితో ఖ్యాతి పొందిన పద్మశ్రీ డ్రమ్స్ శివమణి తమ డ్రమ్స్ వాయిద్యంతో భక్తులను మైమరపించారుపద్మశ్రీ డాశంకర్ మహదేవన్ తన సుమధుర గాత్రంతో భక్తి గీతాలను ఆలపించి సంగీత ప్రియులను మైమరపించారు.


శివమణి వాయిద్య రాగాలు మరియు శంకర్ మహదేవన్ గారి మధుర స్వర విన్యాసం కలసి తిరుమల అంతటా మారుమ్రోగుతూ భక్తులకు ఒక అపూర్వ సంగీతానుభూతిని అందించాయి అద్భుత సంగీత సమ్మేళనం సంగీతాభిమానులకు శ్రవణానందాన్ని కలిగించింది.


 కార్యక్రమంలో ప్రముఖ వాద్యకారులు శ్రీ బి.విబాలసాయి (ఫ్లూట్), శ్రీ రాజేష్ (మాండలిన్), శ్రీ ఎంబర్ కణ్నన్ (వయోలిన్), శ్రీ ప్రవీణ్ నారాయణన్ (తబల), శ్రీ శాశ్విన్ ఆళ్వార్ (కీబోర్డుతమ ప్రతిభను ప్రదర్శించారు.


టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి కళాకారులను సత్కరించారు


 కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుఎస్వీబీసీ న్‌చార్జ్ సీఈఓ శ్రీ వెంకటేశ్వర్లుఇతర అధికారులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments