31.3.26

వేడుకగా వసంతోత్సవాలు ప్రారంభం vasantotsavam











తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు సోమ‌వారం వేడుకగా ప్రారంభమయ్యాయి.


వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే  ఉత్సవానికి 'వసంతోత్సవ'మని పేరు ఏర్పడిందిఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ''ఉపశమనోత్సవం'' అని కూడా అంటారు ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధురఫలాలను స్వామివారికి నివేదిస్తారు వేడుకల కోసం వట్టివేరుతో ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారుఅలాగే వేలాడే కోతులుఏనుగులుసింహాలుపులులునెమళ్లుపాముల తదితర జంతువులుపలురకాల చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా  మండపాన్ని తీర్చిదిద్దారు.


ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు.


వైభవంగా స్నపనతిరుమంజనం :


వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది.


ముందుగా విష్వక్సేనారాధనపుణ్యహవచనంనవకలశాభిషేకంరాజోపచారం నిర్వహించారుఅనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యంముఖ ప్రక్షాళనధూపదీప నైవేద్యం చేపట్టారు


అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిద్రోదకం(పసుపు), గంధోదకం(గంధం)తో స్నపనం నిర్వహించారుశంఖధారచక్రధారసహస్రధారమహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా అర్చకులు చేపట్టారు


 సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తుపురుషసూక్తంశ్రీసూక్తంభూసూక్తంనీలాసూక్తంపంచశాంతి మంత్రాలుదివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామిఅమ్మవార్లకు అలంకరించారు తరువాత స్వామిఅమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.


 కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామిటిటిడి ఈవో శ్రీ ఎం.ర‌విచంద్ర‌బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాశ్ రెడ్డిఅద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రిఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథంఇతర అధికారులువిశేషంగా భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments