17.3.26

ఒంటిమిట్టలో నిరంతరాయంగా అన్నప్రసాదాల వితరణ - టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడుvontimitta









ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణి చేస్తామని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు వెల్లడించారుఒంటిమిట్టలోని పరిపాలనా భవనంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.


మీడియాతో మాట్లాడిన ముఖ్యాంశాలు


 సందర్భంగా మాట్లాడుతూ ఒంటిమిట్టలో శ్రీకోదండ రామస్వామిబ్రహ్మోత్సవాలు ఈనెల 27 తేదీ నుండి ఏప్రిల్ 5 తేదీ వరకు 9 రోజులు పాటు వైభవంగా నిర్వహిస్తామన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం శ్రీరామనవమి ఉత్సవాలు ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నాం

టిటిడి ఆధ్వర్యంలో 2016 నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు శ్రీ రాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నాం.

 - 14 శతాబ్దంలో ఆలయ నిర్మాణం ప్రారంభమై 17 శతాబ్దంలో ముగిసిందని శాసనాలు చెబుతున్నాయి

క్రీ 1356లో బుక్కరాయలు  ఆలయాన్ని నిర్మాణం ప్రారంభించారు

విజయనగర రాజులు అంతరాలయము ,రం మండపం ,మహా ప్రాంగణం గోపురం నిర్మించారు

 

ఏప్రిల్ 1 తేదీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు  

రాష్ట్ర ప్రభుత్వం తరఫున  ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు

శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసేభక్తులకు ఉచితంగా రూ. 50  విలువగల శ్రీవారి  లడ్డు ప్రసాదాన్ని అందిస్తాం.

భక్తులకు అన్నప్రసాదాలు త్రాగు నీరుమజ్జిగ ప్యాకెట్లు పంపిణి చేస్తాం.

 - జిల్లా అధికారులు,  టిటిడి మన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేస్తున్నాం.  

శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించడానికి స్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తాం.

రూ. 4 కోట్ల రూపాయలతో విద్యుత్ దీపాలంకరణ ఎల్ఈడి , పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు

రూ. 20. 17 కోట్లతో 108 అడుగుల జాంబవంతుడు విగ్రహం నిర్మించేలా చర్యలు చేపడుతున్నాం

మాస్టర్ ప్లాన్ లో భాగంలో 37 కోట్లతో 100 గదులు నిర్మిస్తున్నాం

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈరోజు నుంచి ఒంటిమిట్టలో భక్తులకు మూడు పూటలా అన్నప్రసాదాలు అందిస్తున్నాం 

 

అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు


ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు ప్రారంభించారుగత ఏడాది శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్టకు విచ్చేసే క్తులకు అన్నప్రసాదాలను నిరంతరంగా అందించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభించామన్నారుభక్తులకు అన్నప్రసాదాలను అందించేందుకు జర్మన్  షెడ్ ను ఏర్పాటు చేశారుఅందులో భక్తులు కూర్చుని అన్నప్రసాదాలు స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకున్న టిటిడి ఛైర్మెన్


అంతకుముందు శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో స్వామివారిని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు దర్శించుకున్నారుఆలయం వద్దకు రాగానే ఆలయ అధికారులుఅర్చకులు ఘన  స్వాగతం పలికారుదర్శనానంతరం టిటిడి ఛైర్మెన్ కు తీర్థప్రసాదాలను అందించారు.


కల్యాణ వేదికను పరిశీలించిన టిటిడి ఛైర్మెన్


ఏఫ్రిల్ 1 జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను టిటిడి ఛైర్మెన్ పరిశీలించారుభక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని యన అధికారులకు సూచించారు.  కల్యాణ వేదిక ప్రవేశనిష్క్రమణ మార్గాలుభద్రతాఅన్నప్రసాదాల పంపిణీకల్యాణాన్ని భక్తులు ఆనందంగా వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.


 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.చెరుకూరి శ్రీధర్అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్పీ శ్రీ షెల్కె నచికేత్ విశ్వనాథ్జేఈవో శ్రీ వి వీరబ్రహ్మంసివీఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణపలువురు అధికారులు పాల్గొన్నారు


No comments :
Write comments