11.3.26

అద్భుత శిల్ప కళకు నిలయం – ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంvotimitta temple












కడప జిల్లాలోని పవిత్ర క్షేత్రం ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయం అద్భుత శిల్ప సంపదకు నిలయంగా ప్రసిద్ధి చెందింది ఆలయంలోని శిల్పాలు విజయనగర కాలం శిల్పకళ వైభవాన్ని స్మరింపజేస్తాయిముఖ్యంగా రంగమండపంలోని యాళి స్తంభాలు దర్శనార్థులను ఆకట్టుకుంటాయిభారీ గండశిలలను యాళి స్తంభాలుగా మలచిన తీరు శిల్పుల అపూర్వ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.


రాయల వంశ కాలంలో నిర్మితమైన అనే ఆలయాలలో యాళి స్తంభాలు కనిపిస్తాయిఅయితే ఒంటిమిట్ట ఆలయంలో ఒక్కో స్తంభం మధ్యలో నిలువుగా ఖాళీ స్థలం ఉండిఅందులో ఒక వ్యక్తి కూర్చోగలిగే విధంగా ఉండటం ప్రత్యేకతగా నిలుస్తుందిరంగమండపంలోని స్తంభాలపై పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయివాటిలో రెండు స్తంభాలు సంప్రదాయ పేట్రస్ శైలిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడి ఆకర్షణీయంగా నిలుస్తాయి.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చరిత్ర


పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తున్న మయంలోసీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోకి బాణం సంధించగా అక్క నీటి బుగ్గ ఉద్భవించిందిఅదే నేటి ఒంటిమిట్టలోని పవిత్ర రామతీర్థంగా భావిస్తారు.


రావణ సంహారం కోసం శ్రీరాముడికి సహకరించిన జాంబవంతుడు సేవించిన శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట ఆలయంలో కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. ఒకే రాతిపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడినందున  ప్రాంతాన్ని “ఏకశిలా నగరం” అని కూడా పిలుస్తారు.


ఆలయంలోని శాసనాల ప్రకారం  దేవాలయ నిర్మాణం 14 శతాబ్దంలో ప్రారంభమై 17 శతాబ్దానికి పూర్తయింది. 1356లో బుక్కరాయలు ప్రారంభించిన  నిర్మాణాన్ని అనంతరం విజయనగర రాజులుమట్లి రాజులు అభివృద్ధి చేశారుఅంతరాలయంరంగమండపం, మహా ప్రాంగణంగోపురాలు వంటి నిర్మాణాలు  కాలంలో నిర్మితమయ్యాయి.


ఎందరో కవులకు నిలయం ఒంటిమిట్ట


ఒంటిమిట్ట క్షేత్రం ఎన్నో మంది మహాకవులకు ప్రేరణనిచ్చిన పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందిందిమహాకవి శ్రీ పోతన మాత్యులు ఇక్కడే భావగవతాన్ని తెనిగించినట్లు విశ్వసిస్తారుఅయ్యలరాజు తిప్పయ్ ఒంటిమిట్ట శ్రీ కోదండరామునిపై రఘువీర శతకం రచించి అంకితం చేశారురామభద్రకవి రామాభ్యుదయం చించారు.


నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని అనుగ్రహంతో వరకవిగా ప్రసిద్ధి పొందారుఉప్పుగుండూరు వేంకటకవి దశరథరామ శతకం రచించారుఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణంను రచించారుతాళ్లపాక అన్నమయ్య శ్రీరాముని మహిమను కీర్తిస్తూ అనేక సంకీర్తనలు ఆలపించారు.


2015 సెప్టెంబర్ 09 టిటిడిలో విలీనం


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండగా, 2015 సెప్టెంబర్ 09 టిటిడిలో విలీనం అయిందిఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.  ఏడాది ఏప్రిల్ 01 తేదీన శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చురుకుగా చేపడుతోంది.


శ్రీ సీతారాముల కల్యాణం వైభవం


ప్రతి ఏడాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ విధానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.


 సందర్భంగా ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర నిర్వహిస్తారుఅనంతరం అర్చకులు భగవత్ ప్రార్థనతో ప్రారంభించి విష్వక్సేనారాధనపుణ్యాహవచనంరక్షాబంధనంయజ్ఞోపవీతధారణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.


తదుపరి వస్త్ర సమర్పణమధుపర్కంమహాసంకల్పంకన్యాదానం జరుగుతాయిఅనంతరం జీలకర్రబెల్లంమాంగల్యపూజఅక్షతారోపణంమాలపరివర్తనం వంటి మంగళకార్యాలు నిర్వహించి వేదాశీర్వాదాలతో శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా ముగుస్తుందికల్యాణం అనంతరం భక్తులకు ముత్యాలతో కూడిన తలంబ్రాలను టీటీడీ అందజేస్తుంది.


No comments :
Write comments