14.4.26

మే 01 నుండి 9వ‌ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు vedanarayana swmay vari temple




నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 01 నుండి 9 తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.  ఏప్రిల్ 30 తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి సందర్భంగా ఏప్రిల్ 28 తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.


వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకురాత్రి 7.30 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : 


తేదీ


01-05-2026


ఉదయం - ధ్వజారోహణంమేష‌లగ్నంలో ఉద‌యం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు)


రాత్రి  - పెద్దశేష వాహనం


02-05-2026      


ఉదయం - చిన్నశేష వాహనం              


రాత్రి  - హంస వాహనం


03-05-2026


ఉదయం - సింహ వాహనం                  


రాత్రి  - ముత్యపుపందిరి వాహనం


04-05-2026


ఉదయం - కల్పవృక్ష వాహనం


రాత్రి  - సర్వభూపాల వాహనం


05-05-2026


ఉదయం - మోహినీ అవతారం


రాత్రి  - గరుడ వాహనం


06-05-2026


ఉదయం - హనుమంత వాహనం


రాత్రి  - గజ వాహనం


07-05-2026


ఉదయం - సూర్యప్రభ వాహనం


రాత్రి  - చంద్రప్రభ వాహనం


08-05-2026


ఉదయం - రథోత్సవం  ( ఉద‌యం 6 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు)  


సాయంత్రం - ఆర్జితకల్యాణోత్సవం సాయంత్రం 4.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు)


రాత్రి  - అశ్వవాహనం


09-05-2026


ఉదయం - చక్రస్నానం (ఉద‌యం 11.30 నుండి 11.45 గంట‌ల వ‌ర‌కు)


రాత్రి  - ధ్వజావరోహణం ( రాత్రి 7.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు)


బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 8 తేదీన సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి ల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చుగృహస్తులకు ఒక ఉత్తరీయంఒక రవికెఒక లడ్డూఒక వడ బహుమానంగా అందజేస్తారు.


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టుదాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీతసాంస్కృతిక కార్యక్రమాలుభజనలుకోలాటాలు నిర్వహించనున్నారు.


No comments :
Write comments