టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ కోసం మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీవో (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా క్రింది షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడతాయి.
పరీక్షల షెడ్యూల్:
AEE (సివిల్) – 10.05.2026 – ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు
AEE (ఎలక్ట్రికల్) – 10.05.2026 – మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు
AE (సివిల్) – 11.05.2026 – ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు
ATO (సివిల్) – 11.05.2026 – మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు
అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలను ఏప్రిల్ 24 నుండి 29వ తేదీ సాయంత్రం 06.00 గం.ల వరకు ఆన్ లైన్ లో ఎంపిక చేసుకోవాలి. తదుపరి అభ్యర్థులు హాల్ టికెట్లను మే 02 తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే పరీక్ష షిఫ్ట్ వివరాలను పరిశీలించి, అవసరమైన అభ్యర్థి నిర్ధారణ (కాండిడేట్ కన్ఫర్మేషన్) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాలు తదుపరి వివరాలకు టిటిడి వెబ్ సైట్ https://ttd-recruitment.aptonline.in/TTDRecruitment/Views/TTDExamPreferences.aspx ను, కాల్ సెంటర్ నెంబర్ 155257ను సంప్రదించాలి.
No comments :
Write comments