టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మప్రచార కార్యక్రమాలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు నిరంతరం నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏప్రిల్ 16వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.30 గంటలకు ధార్మికోపన్యాసం చేయనున్నారు.
ఈ సందర్భంగా ఆయన “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనున్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ధార్మిక ఉపన్యాసాన్ని ఆలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవలసిందిగా టీటీడీ కోరుతోంది.
No comments :
Write comments