6.4.26

నారాయణవనంలో భక్తి పరవశం - ​ఏప్రిల్ 21–30 వరకు శ్రీ అగస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవ మహోత్సవాలు




నారాయణవనం మండల కేంద్రంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 30 తేదీ వరకు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు.


 ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఏప్రిల్ 20 తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు గణపతి పూజ, అంకురార్పణం నిర్వహించనున్నారు.


ఏప్రిల్ 21 తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుందిఅదే రోజు రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారుబ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య స్నపన తిరుమంజనంరాత్రి 7.30 గంటలకు వాహనసేవలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


వాహన సేవల విశేషాలు (ప్రతి రోజు రాత్రి 07.30 గం.లకు )

ఏప్రిల్ 22 – సింహ వాహనం

ఏప్రిల్ 23 – హంస వాహనం

ఏప్రిల్ 24 – శేష వాహనం

ఏప్రిల్ 25 – నంది వాహనం

ఏప్రిల్ 26 – గజ వాహనం


ఏప్రిల్ 27 రాత్రి 07.30 గం.లకు రథోత్సవం కన్నులపండువగా నిర్వహించనున్నారుఏప్రిల్ 28 రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవంఅనంతరం అశ్వవాహన సేవ జరుగుతుందిరూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయంఒక రవికెఒక లడ్డూఒక అప్పంఅన్నప్రసాదాలు అందజేయబడతాయి.


ఏప్రిల్ 29 ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామివారి వీధి ఉత్సవం రుగుతుందిసాయంత్రం రావణాసుర వాహనంపై స్వామివారు దర్శనమిస్తారుఏప్రిల్ 30 కైలాసకోనలో త్రిశూలస్నానం ఘనంగా నిర్వహించిరాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


ఆధ్యాత్మిక కార్యక్రమాలు


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కోలాటంభక్తిసంగీతంఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆహ్లాదపరచనున్నాయి.


స్థల పురాణం


నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి శ్రీ ఆకాశ మహారాజు పితామహులు  ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి క్షేత్రంలో శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారుఅనంతరం శ్రీ అగస్త్య మహర్షులు వేద ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి పూజించినందువల్ల స్వామివారికి “అగస్తీశ్వరస్వామి” అనే పేరు వచ్చింది.

No comments :
Write comments