21.4.26

ఏప్రిల్ 22న శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ ankurarpanam




తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం ఏప్రిల్ 22 తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి 8.30 గంటల వరకు జరుగనుంది.


 ఆలయంలో మార్చి 17 నుండి 25 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడిన విషయం తెలిసిందేబ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులుఅధికారులుభక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు యాగం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.


ఏప్రిల్ 23 తేదీ ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారుఅమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.


అనంతరం సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించబడుతుంది.


తదుపరి రాత్రి 7.00 గంటలకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తారు.

 పుష్పయాగంలో గృహస్తులు (ఇద్దరురూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పాల్గొనవచ్చు.

No comments :
Write comments