29.4.26

ఏప్రిల్ 30న శ్రీ నృసింహ జ‌యంతి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి narasimha jayanti




శ్రీ‌ నృసింహ జ‌యంతిమాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతిని ఏప్రిల్ 30 తేదీ తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు.


శ్రీ నృసింహ జ‌యంతి


ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో శ్రీ నృసింహ జ‌యంతి ఉత్సవం చేపడతారుశ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి  సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.


శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది.


యోగముద్రలో ఉన్న  విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారుస్వామివారికి నాలుగు చేతులుంటాయిపైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయికింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి


క్రీ. 1330 నుంచి క్రీ. 1360 మధ్య కాలంలో నిర్మితమైన  ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారుఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.


వెంగమాంబ జయంతి :


శ్రీవారునరసింహ స్వామి భక్తగ్రేసరురాలైన మాతృశ్రీ తారీగొండ వెంగమాంబ జయంతి కూడా ఏప్రిల్ 30 రుగనుంది.


 సందర్భంగా తిరుమలలోని వెంగమాం బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు.


అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి పరిణయ మండపానికి వేంచేపు చేస్తారుఅక్కడ వెంగమాంబ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు


ఇందులో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు.


నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయనాంచారులతో కలిసి శ్రీ మలయప్పస్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారుఇందులో టీటీడీ అధికారులువెంగమాంబ వంశస్థులు పాల్గొంటారు.

No comments :
Write comments